![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -253 లో.....ఆనందరావు ఇంటికి రాగానే ఇప్పుడు ఎందుకు వచ్చావ్ నాన్న అని శ్రీవల్లి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తిరుపతి చెయ్ కలశం లో నుండి బయటకు వస్తే అవి గిల్టీ నగలు అని మన బండారం బయటపడుతుంది కదా అందుకే ఒక ప్లాన్ ఆలోచించాను. ఈ ఒక్క రోజుకి నేను ఇక్కడే ఉండేలా చూడమని ఆనందరావు అంటాడు. అతను బయటకి వచ్చి ఇక నేను వెళ్తాను బావగారు అని రామరాజుతో అంటాడు. ఇప్పుడు ఎలా వెళ్తావ్.. నాన్న చీకటి అయింది వద్దని శ్రీవల్లి అంటుంది దాంతో ఆగిపోతాడు.
ధీరజ్ డబ్బు సర్దుబాటు చేస్తాడో లేదో అని చందు టెన్షన్ పడతాడు. ఈ రోజు డబ్బు సర్దుబాటు కాకపోతే నా పరిస్థితి ఏంటోనని సాగర్ తో అంటుంటే ధీరజ్ వింటాడు. మరొకవైపు ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేసి.. నేను ఇక్కడే ఉన్నానంటూ ఫోన్ చేస్తాడు. ప్రేమ భయంతో బయటకు వస్తుంది. ఆ తర్వాత రామరాజుని ధీరజ్ డబ్బు అడగడానికి వస్తాడు కానీ అడుగులేకపోతాడు. ఏం చెయ్యలేక ధీరజ్ రామరాజు ఫోన్ నుండి డబ్బు పంపించుకుంటాడు.
నన్ను క్షమించు నాన్న.. అన్నయ్య కోసం తప్పడం లేదని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ ని ప్రేమ కలిసి వాడి సంగతి చెప్పాలని వాడు చెప్పినట్లు వెళ్తుంటుంది కానీ కళ్యాణ్ ఎక్కడ కన్పించడు. తరువాయి భాగంలో ప్రేమ అర్ధరాత్రి రోడ్డుపై కంగారుగా ధీరజ్ కి కన్పిస్తుంది. ఏమైందని ధీరజ్ అడిగితే ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. దాంతో ప్రేమ చెంపచెల్లుమనిపిస్తాడు ధీరజ్. అదంతా విశ్వ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |